
ఆయుష్షు పోస్తూ..
ఆయువు పోయినా..
సుజాతనగర్: అమ్మ జన్మనిస్తే అవయవదానం పునర్జన్మనిస్తుంది.. మరణించినా కళ్లు మాత్రం ఈ లోకాన్ని చూస్తూనే ఉంటాయి. ఏ లోకంలో ఉన్నా మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేస్తూనే ఉంటాయి. మన శ్వాస ఆగిపోయినా గుండె మాత్రం లబ్ డబ్ అని కొట్టుకుంటూనే ఉంటుంది.. ‘ఆయువు పోయినా.. అవయదానంతో ఊపిరిపోద్దాం.. అవయ వాలను ఈ లోకంలో జీవించనిద్దాం.. రండి అవయదానం చేద్దాం.. మరణించినా మరో వ్యక్తిలో జీవించే ఉందాం’.. అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా కొందరు ఇంకా అపోహలు, అనుమానాలతో వెనకడుగు వేస్తున్నారు. కానీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం అవయవదానంపై అవగాహన పెరుగుతోంది. ఏటా ఆగస్టు 13న ‘ప్రపంచ అవయవదాన దినోత్సవం’ నిర్వహిస్తున్న సందర్భంగా కథనం.
అవయవదానానికి ముందుకొస్తున్న కుటుంబాలు
ఉమ్మడి జిల్లాలో పెరిగిన అవగాహన
నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం
చండ్రుగొండ మండలంలో..
తాను మరణించినా ముగ్గురికి అవయవదానం చేశాడు భదాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం టేకులబంజర గ్రామానికి చెందిన రైతు పల్లె వెంకన్న. వ్యవసా యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వెంకన్న కంటిపరీక్షల నిమిత్తం రెండేళ్ల కిందట పాల్వంచ వెళ్తుండగా కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను హైదరాబాద్ తీసుకెళ్లారు. చికిత్స అందించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలిపారు. కుటుంబసభ్యులను కలిసిన జీవన్‌దాన్ ప్రతినిధులు అవయవదానం గురించి అవగాహన కల్పించారు. కాలేయంతో పాటు, రెండు కళ్లను సేకరించారు.

ఆయుష్షు పోస్తూ..