
ఇల్లెందు, మానుకోటకూ ‘సీతారామ’ జలాలు ఇవ్వండి
ఖమ్మంమయూరిసెంటర్: సీతారామ ప్రాజెక్టును ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాలకు సైతం అనుసంధానించి సాగునీరు సరఫరా చేయా లని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం మాస్‌లైన్ నాయకులు హైదరాబాద్‌లో మంగళవారం సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో సీతారామ ప్రా జెక్టును నిర్మించినా ఇల్లెందు ప్రాంత రైతులకు ప్ర యోజనం లేదన్నారు. అన్ని ప్రాంతాలకు సీతారామ నీరు అందేలా చూడాలని కోరారు. అలాగే, పోడు సాగుదారులకు పొజిషన్ హక్కులు కల్పించి, అర్హులకు పట్టాలు జారీ చేయాలని, పోడు రైతులపై అటవీ అధికారుల దాడులను నిలిపివేయించాలన్నారు. అంతేకాక వ్యవసాయ కూలీలకు రూ.12 వేల భృతి, పెన్షన్ పెంపు, మహిళలకు రూ.2,500 చెల్లింపుతో పాటు పెండింగ్ ఉపకార వేతనాలు, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయా లని వినతిపత్రంలో పేర్కొన్నారు. అంతేకాక మంత్రులు జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు మాస్‌లైన్, ఇతర వామపక్షల పార్టీలు, ప్రజా సంఘాల నాయకులను ముందస్తు అరెస్టు చేస్తున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా అధికారులకు సూచనలు చేస్తానని చెప్పారని రంగారావు వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, నాయకులు కేజీ రాంచందర్, కె.రమ, కె.సూర్యం పాల్గొన్నారు.
సీఎంకు విన్నవించిన మాస్‌లైన్ నాయకులు