
●వృద్ధురాలు సైతం..
గరీభ్‌పేట గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం తండాకు చెందిన పెద్ది కొమరమ్మ రెండేళ్ల కిందట ఆస్పత్రికి వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. తలకు బలమైన గాయం అయింది. ఈమె భర్త సింగరేణి మాజీ ఉద్యోగి కావడంతో తొలుత సింగరేణి ఆస్పత్రిలో వైద్యం అందించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ క్రమంలో బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించారు. అవయవదానంతో మరికొందరికి పునర్జన్మ ప్రసాదించవచ్చని వైద్యులు కుటుంబసభ్యులకు అవగాహన కల్పించారు. కొమరమ్మ మూత్రపిండాలు, కాలేయంను వైద్యులు సేకరించారు.