
వైభవంగా చండీహోమం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయంలో శని వారం చండీహోమం పూజలను వైభవంగా జరిపారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని యాగశాలలో చండీ హోమం నిర్వహించా రు. ముందుగా మేళతాళాల నడుమ, వేద మంత్రాలతో స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధ న, గణపతి పూజలు గావించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజలో పాల్గొన్న 11 మంది భక్త దంపతులకు అర్చకులు అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందజేశారు. పూజా కార్యక్రమాల్లో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, సభ్యులు చందుపట్ల రమ్య, పాపారావు, రామిరెడ్డి, శ్రీనివాస్, సాయిబాబా, సుధాకర్, శేఖర్, అర్చకులు పాల్గొన్నారు.
నులి పురుగులను నివారించాలి
కొత్తగూడెంఅర్బన్: పిల్లల తల్లిదండ్రులు నులిపురుగుల నిర్మూలనపై అవగాహన పెంచుకోవాలని జిల్లా వైద్యా, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్.జయలక్ష్మి సూ చించారు. శనివారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 11, 18వ తేదీల్లో నిర్వహించే కార్యక్రమంలో 19 ఏళ్లలోపు పిల్లలు 3,36,136 మందికి నులిపురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 2,060 అంగన్‌వాడీ కేంద్రాలు, 1,771 పాఠశాలలు, కళాశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. మాత్రలు రక్తహీనత, పోషకాహార లోపం, బలహీనమైన మానసిక, శారీ రక అభివృద్ధిని నివారిస్తాయని వివరించారు.
అకస్మాత్తుగా ఊడిన
ఆర్టీసీ బస్సు టైరు
అశ్వాపురం: మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు శనివారం పెనుప్రమాదం తప్పింది. భద్రాచలం నుంచి మణుగూరు వెళ్తున్న బస్సు వెనుక టైరు అశ్వాపురం మండలం మిట్టగూడెం క్రాస్ రోడ్డు వద్ద మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై అకస్మాత్తుగా ఊడింది. దీంతో బస్సు రహదారి పక్కకు దూసుకెళ్లింది. ఊడిన టైరు ఓ స్కూటీకి తగలడంతో, స్కూటీపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

వైభవంగా చండీహోమం