
ఆదివాసీ సంస్కృతిని పరిరక్షించాలి
భద్రాచలం: ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ, ఆదివాసీ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. గిరిజన భవనంలో తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లంవెంకట్రావు మాట్లాడుతూ ఆదివా సీలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వి నియోగం చేసుకొని ఆర్ధికాభివృద్ధి సాధించాలని సూచించారు. భవిష్యత్ తరాలకు ఆదివా సీ సంస్కృతీసంప్రదా యాలను అందించాలని చెప్పారు. ఐటీడీఏ తోడ్పాటుతో స్వయం సహా యక గ్రూపుల ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ గిరిజనుల ఆర్థిక అసమ తుల్యతను పారదోలేందుకు ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని పేర్కొన్నారు. భద్రాచలం ఐటీడీఏ పేరు ఢిలీల్లో మార్మోగుతుండటమే ఇందుకు నిదర్శమని అన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కోయ భాష లిపిని అభివృద్ధి చేస్తున్నామని, ఆది వాసీల ఇలవేల్పుల చరిత్రను గ్రంథ రూపంలోకి తెస్తున్నట్లు వివరించారు. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ మాట్లాడుతూ ఏజెన్సీ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. అనంతరం కలెక్టర్, ఐటీడీఏ పీఓ, సబ్‌కలెక్టర్లను ఆదివాసీ సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు. ఆ తర్వాత గిరిజన భవన్‌లో నిర్వహించిన ఆదివాసీ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆదివా సీలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. గిరిజన మ్యూజియం టేబుల్ బుక్‌ను ఆవిష్కరించారు. తొలుత ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ కూడలిలో ఉన్న ఆదివాసీ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు డేవిడ్ రాజ్, మణెమ్మ, సున్నం రాంబాబు, అన్ని విభాగాల సిబ్బంది, గిరిజన సంఘాల నాయకులు పూనెం కృష్ణ, పాయం రవి వర్మ, శరత్ బాబు, మురళి, రమేష్, పుల్లయ్య, వీరస్వామి, సుధారాణి, అరుణ , వెంకటరావు వీరభద్రం, విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
హాజరైన ఎమ్మెల్యే, కలెక్టర్,
పీఓ, సబ్ కలెక్టర్

ఆదివాసీ సంస్కృతిని పరిరక్షించాలి