ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

Aug 19 2024 1:18 AM | Updated on Aug 19 2024 1:20 PM

ప్రేమ విఫలమై  యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

మధిర : ప్రేమ విఫలమైందనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన బొగ్గుల శ్రీనివాస్‌రెడ్డి ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుండగా ఆయన భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు. వీరు మధిరలోని సాయినగర్‌ లో నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు మణిరాగ్‌ రెడ్డి(29) హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఉద్యోగం చేస్తూ బోరబండ సమీపంలోని గాయత్రి నగర్‌లో ఉంటున్నాడు. 

కాగా, ప్రేమ విఫలమైందనే మనస్తాపంతో ఈనెల 12న రాత్రి 11 గంటల సమయంలో పాయిజన్‌ తాగాడు. అదే గదిలో ఉంటున్న మిత్రులు గమనించి యశోదా ఆస్పత్రికి తరలించి, శ్రీనివాసరెడ్డికి సమాచారం అందించారు. దీంతో ఆయన హైదరాబాద్‌ ఆస్పత్రికి వెళ్లగా మణిరాగ్‌రెడ్డి బతికే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. దీంతో ఆదివారం మధిరకు తీసుకొస్తుండగానే మణిరాగ్‌రెడ్డి తుదిశ్వాస విడిచాడు. మృతదేహానికి మధిర ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించాక బనిగండ్లపాడుకు తరలించారు. ఈ మేరకు తండ్రి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement