సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ల కాళ్లు, చేతులు నరికేస్తాం.. | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ల కాళ్లు, చేతులు నరికేస్తాం..

Jun 13 2023 9:50 AM | Updated on Jun 13 2023 9:50 AM

నారాయణపూర్‌ జిల్లాలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన బ్యానర్‌  - Sakshi

నారాయణపూర్‌ జిల్లాలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన బ్యానర్‌

గనులు తెరిచేందుకు సహకరిస్తే సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ల కాళ్లు, చేతులు నరకడమే

భద్రాద్రి: ఛత్తీస్‌గఢ్‌లో అభివృద్ధి పనులకే కాక గనులు తెరిచేందుకు సహకరిస్తే సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ల కాళ్లు, చేతులు నరకడమే కాక ఇంకా ఎవరైనా ఉంటే హతమరుస్తామని మావోయిస్టులు హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌ జిల్లాలోని ఓర్చా బ్లాక్‌లో నది నీటిని నిల్వ చేసేందుకు కరకట్ట నిర్మిస్తున్నారు. ఆది నుంచి ఈ పనులను వ్యతిరేకిస్తున్న మావోయిస్టులు నిలివేయాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

తాజాగా ఆదివారం రాత్రి ఓర్చా సమీపంలోని ప్రధాన రహదారి వెంట వాల్‌పోస్టర్లు వేయడంతో పాటు బ్యానర్లు కట్టారు. నదిలో కరకట్ట నిర్మాణ పనులతో పాటు, ఈ ప్రాంతంలో గనుల్లో తవ్వకాలను నిలిపివేయాలని అందులో హెచ్చరించారు. ఈ పనులకు సహకరిస్తున్న సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ల కాళ్లు చేతులు నరికివేయడమే కాక గైతాపారా, బెస్మెట్ట గ్రామాల ప్రజలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మావోయిస్టులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement