బూర్గంపాడు: అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినందున యువత పెడదోవ పట్టకుండా సన్మార్గంలో నడవాలని పాల్వంచ డీఎస్పీ సతీష్‌కుమార్ సూచించారు. మండలంలోని సారపాక సుందరయ్యనగర్‌లో మంగళవారం తెల్లవారుజామున కార్డెన్ సెర్చ్ చేపట్టారు. డాగ్ స్క్వాడ్ బృందాలతో ఇళ్లలో విస్తృతంగా తనిఖీ చేశా రు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలను నమోదు చేసుకోవడమే కాక సరైన అనుమతి పత్రాలు లేని 43 మోటార్ సైకిళ్లు, ఆటోలను గుర్తించా రు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి విని యోగం, అక్రమ రవాణా కారణంగా జైలుపాలు కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎవరైనా గంజాయి రవాణా చేసినట్లు తేలితే పోలీసులకు తెలి యజేయాలని, వాహనదారులు అన్ని ధ్రువ పత్రాలను వెంట ఉంచుకోవడంతో పాటు నిబంధనలు పాటించాలని తెలిపారు. పాల్వంచ సీఐ సతీష్, బూర్గంపాడు ఎస్‌ఐలు మేడ ప్రసాద్, నాగభిక్షం, రామ్మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.
కార్డెన్ సెర్చ్‌లో డీఎస్పీ సతీష్‌కుమార్


