మంగళగిరి రూరల్: హెచ్‌పీసీఎల్ నూతనంగా ప్రవేశపెట్టిన 10 కిలోల హెచ్‌పీ నవ్య కాంపొజిట్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా మంగళగిరి పట్టణం లో సోమవారం ఆవిష్కరించారు. మంగళగిరిలోని రాయల్ గ్యాస్ ఏజెన్సీలో జరిగిన కార్యక్రమంలో హెచ్‌పీసీఎల్ దక్షిణ మధ్య జోన్ చీఫ్ జనరల్ మేనేజర్ దేబేష్ పురోహిత్ సిలిండర్‌ను లాంఛనంగా విడుదల చేశారు. అనంతరం తాడేపల్లి హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో పీవోఎస్‌ను లాంచ్ చేశారు. కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రాంతాన్ని బట్టి సిలిండర్ ధర రూ.4,909 వరకు రీఫిల్ ధర రూ. 1723 వరకు ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఏపీ రాష్ట్రస్థాయి సమన్వయకర్త వి.రవీంద్ర కుమార్, దక్షిణ మధ్య జోన్ డీజీఎం (సేల్స్) ఆర్.ఉమాపతి, డీజీఎం (ఎన్‌డీ సేల్) ఆశిష్ సింఘాల్, డీజీఎం (ఆపరేషన్‌్స్) ఉదయ్ కృష్ణ, విజయవాడ డీజీఎం (ఎల్‌పీజీ ఆర్వో) కొమర శ్రీనివాసు, విజయవాడ రిటైల్ ఆర్వో అభిషేక్ సింగ్‌తో పాటు హెచ్‌పీ గ్యాస్ డీలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


