డీఎస్సీలో అక్రమాలపై నిరసన జ్వాల | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీలో అక్రమాలపై నిరసన జ్వాల

Aug 9 2026 2:22 AM | Updated on Aug 9 2026 2:22 AM

వేమూరులో మాట్లాడుతున్న పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త

వరికూటి అశోక్‌బాబు, దీక్షలో పాల్గొన్న నేతలు

చీరాలలో దీక్ష శిబిరం వద్ద మాట్లాడుతున్న పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి

కరణం వెంకటేష్‌ బాబు, నాయకులు

బాపట్లలో జరిగిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

కోన రఘుపతి, నాయకులు

డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ కీలక నాయకులు డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో మూడు రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారంతో ముగిశాయి. పలుచోట్ల దీక్ష శిబిరం వరకు నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. పలు ప్రాంతాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని నాయకులు స్పష్టం చేశారు. – సాక్షి నెట్‌వర్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement