తాడికొండ: రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవంలో భాగంగా ఉండవల్లి స్టీల్ బ్రిడ్జి నుంచి దొండపాడు వరకు జరుగుతున్న పనులను అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) చైర్‌పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీపార్థసారథి శనివారం పరిశీలించారు. మూడు ఫేజుల్లో జరుగుతున్న సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభం చేయనున్న నేపథ్యంలో అధికారులతో సమీక్షించారు. సీడ్ యాక్సెస్‌రోడ్డుపై ఉండవల్లి వద్ద కొండవీటివాగుపై జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించి అప్రోచ్ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని ఏడీసీ చీఫ్ ఇంజినీరు టి మోజెస్‌కుమార్‌ను ఆదేశించారు. రాయపూడి గ్రామంలో నిర్మించిన సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజినీరు టి.వైకుంఠరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు శ్రీధర్‌రెడ్డి, డీఈఈ వై అప్పాజి, ఎన్‌సీసీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.


