మాచర్ల: అమరావతి చాంపియన్ టోర్నమెంటులో భాగంగా నరసరావుపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎంపికల్లో మాచర్ల మండల పరిధిలోని విజయపురిసౌత్‌లోని ఏపీఆర్‌జేసీ విద్యార్థులు సత్తా చాటారు. వివిధ క్రీడాంశాల్లో 8 మంది రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. వారిలో డి. ముత్తరాజావలి (షాట్ పుట్), ఎస్‌కే అబూ బక్కర్ (హై జంప్), సి. నిఖిల్ విశాల్ (వం మీటర్ల పరుగు), బి. మల్లికార్జున (ఆర్చరీ), ఆర్ షాలెంరాజు (షాట్‌పుట్), ఎం. సుభాష్ చంద్ర (యోగా), పి. మెస్సీపాల్ (వెయిట్ లిఫ్టింగ్), డి. రాహుల్ గాంధీ (వెయిట్ లిఫ్టింగ్) ఉన్నారు. వారిని ప్రిన్సిపాల్ హేమనాభరెడ్డి అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణమని అన్నారు.


