ప్రధాన సమాచార అధికారి పర్యటన | - | Sakshi
Sakshi News home page

ప్రధాన సమాచార అధికారి పర్యటన

Jul 11 2026 3:34 AM | Updated on Jul 11 2026 3:34 AM

బాపట్ల: ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన సమాచార అధికారి సి.హెచ్‌. సునీల్‌ శుక్రవారం బాపట్ల కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ముందుగా డీఆర్‌ఓ జి. గంగాధర్‌ గౌడ్‌ పూల మొక్క అందజేసి, స్వాగతం పలికారు. జిల్లా పర్యటనలో భాగంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేశాక జిల్లా కలెక్టరేట్‌లో పలు విభాగాలను సందర్శించారు. అధికారులు నిర్వహిస్తున్న రిజిస్టర్‌లను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పౌర సంబంధాల అధికారి, పరిపాలన అధికారి మల్లికార్జున రావు, డీఆర్డీఏ పీడీ బి. సింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement