ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రావెల్‌ బస్సు | - | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రావెల్‌ బస్సు

Jun 17 2024 2:26 AM | Updated on Jun 17 2024 11:54 AM

ఆగి ఉ

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రావెల్‌ బస్సు

కంటెపూడి వద్ద ప్రమాదం

క్లీనర్‌ మృతి, మరో తొమ్మిది మందికి గాయాలు

బస్సు డైవర్‌ రమేష్‌బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు

సత్తెనపల్లి: రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి వద్ద ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల నుంచి హైదరాబాద్‌కు 30 మంది ప్రయాణికులతో మార్నింగ్‌ స్టార్‌ ట్రావెల్స్‌ బస్సు ఉదయం బయలు దేరింది. కంటెపూడి సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్‌గా పనిచేస్తున్న నరసరావుపేట మండలం కాకాని గ్రామానికి చెందిన తిమ్మిశెట్టి మణికంఠ (24)కు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యశాలకు తరలించే క్రమంలో మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వారిలో బాపట్లకు చెందిన కె.లక్ష్మీ సుధ, కె.లక్ష్మి, కె.చంద్రశేఖర్‌, ప్రత్తిపాడుకు చెందిన వై. ప్రసాదరెడ్డి, గార్లపాడుకు చెందిన రత్తయ్య, పెదనందిపాడుకు చెందిన మాధవి ఉన్నారు.

 మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించగా ప్రాథమిక చికిత్స చేయించుకుని వెళ్లారు. మృతుడి తల్లి తిమ్మిశెట్టి నాగమణి ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి రూరల్‌ ఏఎస్‌ఐ కరీముల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు కారకుడైన బస్సు డ్రైవర్‌ ఈదర రమే ష్‌బాబును సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సు ప్రమాదానికి గురి కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కొందరు హైదరాబాద్‌ వెళ్లగా, మరి కొందరు ప్రయాణాన్ని వాయిదా వేసుకొని వెనక్కి వెళ్లారు.

 

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రావెల్‌ బస్సు 1
1/1

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రావెల్‌ బస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement