చీరాల మున్సిపల్ కమిషనర్ బదిలీ
చీరాల: చీరాల మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ బదిలీ అయ్యారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయనను డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఆయన చీరాల మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 15 నెలల పాటు చీరాలలో కమిషనర్‌గా పనిచేసిన ఆయన కమిషనర్ల బదిలీల్లో శుక్రవారం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వెయిటింగ్‌లో ఉన్న డానియేల్ జోసఫ్‌ను చీరాల మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు. ఆయన కొద్ది రోజుల్లో చీరాల మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
చీరాల మున్సిపల్ కమిషనర్ బదిలీ


