భక్తి శ్రద్ధలతో ధనుర్మాస పూజలు | - | Sakshi
Sakshi News home page

భక్తి శ్రద్ధలతో ధనుర్మాస పూజలు

Dec 27 2025 7:42 AM | Updated on Dec 27 2025 7:42 AM

భక్తి

భక్తి శ్రద్ధలతో ధనుర్మాస పూజలు

రామావతారంలో వేంకటేశ్వరస్వామి

సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సత్తెనపల్లిలోని వడ్డవల్లి శ్రీరామాలయం, వేంకటేశ్వర స్వామి దేవాలయం, రైల్వేస్టేషన్‌రోడ్‌లోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. వడ్డవల్లిలో శ్రీవారిని అభిషేక అలంకరణ చేపట్టగా రైల్వేస్టేషన్‌రోడ్‌లో శ్రీవారిని త్రివిక్రమ అలంకరణ చేపట్టి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్య లో హాజరై స్వామి వారి కృపకు పాత్రులయ్యా రు. వడ్డవల్లిలో మహిళలు పాశురాలు పఠించ గా, రైల్వేస్టేషన్‌రోడ్‌లో కోలాట ప్రదర్శన నిర్వహించారు.

తెనాలిటౌన్‌: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం స్వామివారిని రామావతారంలో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

మినీ భారత సాంస్కృతిక, కళా సమ్మేళనమే ‘సారస్‌’

గుంటూరు వెస్ట్‌: సారస్‌–మినీ భారత సాంస్కృతిక, కళా సమ్మేళనంగా నిర్వహించడం జరుగుతుందని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్‌ తెలిపారు. సారస్‌ (సేల్‌ ఆఫ్‌ ఆర్టికల్స్‌ ఆఫ్‌ రూరల్‌ ఆర్టిస్ట్స్‌ సొసైటీ) ప్రదర్శనశాల ఏర్పాట్లపై శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాతో కలసి సమీక్ష నిర్వహించారు. పెమ్మసాని మాట్లాడుతూ దేశం నలు మూలల నుంచి 600 మందికి పైగా చేనేత, హస్త కళాకారులు, సాంస్కృతిక కళాకారులు వస్తున్నారన్నారు. 250కి పైగా ప్రదర్శన శాలలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ మినీ భారత సమ్మేళనానికి పెద్ద ఎత్తున ప్రచారం జరగాలన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రదర్శనలను తిలకించడమే కాకుండా వివిధ రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలు, హస్త కళలు, చేనేతలు, ఆహార పదార్థాల రుచులను తెలుసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

జాతీయ షూటింగ్‌లో ముఖేష్‌కు రజతం

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): ఢిల్లీలో జరుగుతున్న 68వ జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీ ల్లో శుక్రవారం గుంటూరుకు చెందిన నేలపల్లి ముఖేష్‌ రజత పతకం సాధించాడని నేలవల్లి శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 25మీటర్ల రాపిడ్‌ ఫైర్‌ జూనియర్‌ విభాగంలో ముఖేష్‌ రజత పతకం గెలుపొందాడన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సూరజ్‌ శర్మ బంగారు పతకం గెలువగా హరియాణాకు చెందిన జతిన్‌ కాంస్య పతకం సాధించాడన్నారు. చాంపియన్‌షిప్‌లో సీనియర్‌ జూనియర్‌ విభాగాల్లో పోటీపడిన ముఖేష్‌ రిలేలో 600కు గాను 579 పాయింట్లు సాధించి సీనియర్లో నాలుగో స్థానం జూనియర్లో ప్రథమ స్థానంలో నిలిచాడ న్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరగనున్న ఏషియన్‌ షూటింగ్‌ చాంపియన్‌ షిప్‌ జూనియర్‌ విభాగంలో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత, టీం, మిక్స్‌డ్‌, 25 మీటర్ల స్పో ట్స్‌ పిస్టల్‌, స్టాండర్డ్‌ పిస్టల్‌, రాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నాడన్నారు. ముఖేష్‌ను ఆంధ్రప్రదేశ్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సలలిత్‌, కార్యదర్శి రాజ్‌కుమార్‌, కేఎల్‌ యూనివర్సిటీ స్పోట్స్‌ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ కాకర్ల హరి కిషోర్‌, పీడీ శ్రీహరి, పూజిత అభినందించారన్నారు.

భక్తి శ్రద్ధలతో ధనుర్మాస పూజలు 1
1/3

భక్తి శ్రద్ధలతో ధనుర్మాస పూజలు

భక్తి శ్రద్ధలతో ధనుర్మాస పూజలు 2
2/3

భక్తి శ్రద్ధలతో ధనుర్మాస పూజలు

భక్తి శ్రద్ధలతో ధనుర్మాస పూజలు 3
3/3

భక్తి శ్రద్ధలతో ధనుర్మాస పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement