గుర్రంకొండ: రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడు తల్లీ అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఈసందర్భంగా భక్తుల ఆలయంలో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించుకొన్నారు.
నేడు వేలంపాటలు..
మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసినశ్రీ రెడ్డెమ్మకొండ ఆలయంలో ఏడాదిపాటు వివిధ దుకాణాలు నిర్వహించుకునేందుకు వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఆలయకమిటీ చైర్మన్ రాజన్న నాయుడు, ఈవో మంజుల తెలిపారు. ఆదివారం స్థానిక ఆలయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సోమవారం ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో జిల్లా దేవదాయశాఖ ఆధికారుల ఆధ్వర్యంలో వేలం పాటలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తిగల వారు వేలం పాటలకు ముందే రూ. 10 వేలు డిపాజిట్టు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈనెల7వ తేదీన నిర్వహించిన వేలం పాటలో సరైన వేలం పాటలు రానందున మళ్లీ 16న నిర్వహిస్తున్నామన్నారు.


