ఒకే మొక్కకు 50 బ్రహ్మకమలాలు! | - | Sakshi
Sakshi News home page

ఒకే మొక్కకు 50 బ్రహ్మకమలాలు!

Nov 16 2026 1:26 AM | Updated on Nov 16 2026 1:26 AM

ఒకే మొక్కకు 50 బ్రహ్మకమలాలు! గ్రైండర్‌ మరమ్మతు చేస్తుండగా ప్రమాదం

గుర్రంకొండ: మండలంలోని శెట్టివారిపల్లె పంచాయతీ అరిగెలవారిపల్లె గ్రామానికి చెందిన మల్లికార్జున దంపతుల ఇంట్లో ఆదివారం సాయంత్రం ఒకే మొక్కకు ఏకంగా 50 బ్రహ్మకమలాలు విరబూశాయి. సాధారణంగా ఒకేసారి రెండు నుంచి పది వరకు మాత్రమే ఈ పుష్పాలు వికసిస్తుంటాయి. అందుకు భిన్నంగా చెట్టు నిండా 50 పూలు విరబూయడంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఏడాదికొకసారి రాత్రి వేళల్లో వికసించే బ్రహ్మకమలాలు ఏ ఇంట పూస్తే ఆ ఇల్లు సకల సంపదలు, శుభాలకు నిలయంగా మారుతుందని భక్తుల నమ్మకం. ఈ పవిత్ర మాసంలో విరబూసిన బ్రహ్మకమలాలకు మహిళలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.

– మెకానిక్‌కు తీవ్ర గాయాలు

మదనపల్లె టౌన్‌ : గ్రైండర్‌ యంత్రాన్ని మరమ్మతు చేస్తుండగా అందులో ఇరుక్కుని ఓ మెకానిక్‌ తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం ములకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. బురకాయలకోటకు చెందిన మహమ్మద్‌ (23) గ్రైండర్‌ను మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో ఇరుక్కున్నాడు. స్థానికుల సాయంతో బాదితున్ని బయటకు తీసి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు అతన్ని చికిత్సల నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.డాక్టర్లు ప్రథమ చికిత్స అందించి, అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయాకు రెఫర్‌ చేశారు. వైద్యుల సలహా మేరకు బాధితుడిని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

72 నామినేషన్లు దాఖలు

– వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థిగా

ఖలీల్‌ నామినేషన్‌

బి.కొత్తకోట: బి.కొత్తకోట నగర పంచాయతీకి జరుగుతున్న ఎన్నికల్లో రెండవ రోజు ఆదివారం 72 నామినేషన్లు దాఖలయ్యాయి. బి.కొత్తకోట, మదనపల్లెలో రెండు చోట్ల నామినేషన్లను అధికారులు స్వీకరిస్తున్నారు. బి.కొత్తకోటలో మాజీ ఎంపీపీ పాగొండ ఖలీల్‌ వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే వార్డులకు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లలో చైర్మన్‌ పదవికి 12 దాఖలవ్వగా వాటిలో వైఎస్సార్‌సీపీ రెండు, టీడీపీ మూడు, జనసేన ఒకటి, సీపీఐ ఒకటి, కాంగ్రెస్‌ రెండు, ఇతర పార్టీలు ఒకటి, స్వతంత్రులు మూడు నామినేషన్లు దాఖలు చేశారు. 23 వార్డులకు సంబంధించి 60 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున 29, టీడీపీ తరఫున 15, జనసేన తరఫున ఆరు, సీపీఐ తరఫున ఒకటి, స్వతంత్రులు 4 నామినేషన్లు వేశారు. సోమ వారం నామినేషన్లకు ఆఖరు కావడంతో మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement