స్టేషన్‌ ఆవరణలో పాము పిల్ల కలకలం | - | Sakshi
Sakshi News home page

స్టేషన్‌ ఆవరణలో పాము పిల్ల కలకలం

Nov 16 2026 1:26 AM | Updated on Nov 16 2026 1:26 AM

స్టేషన్‌ ఆవరణలో పాము పిల్ల కలకలం

పెద్దతిప్పసముద్రం: స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఆదివారం ఓ పాము పిల్ల ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు నాలుగైదు ఏళ్లుగా బహిరంగ వేలానికి నోచుకోకపోవడంతో స్టేషన్‌ చుట్టూ పేరుకుపోయి తుప్పు పడుతున్నాయి. వాటి మధ్య పొదలు, అపరిశుభ్రత పెరిగి విషసర్పాలు ఆవాసం ఏర్పరచుకుంటున్నాయని స్థానికులు భావిస్తున్నారు. మరోవైపు, రాత్రి వేళల్లో విధులు నిర్వహించే సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి స్టేషన్‌లో కనీసం మంచాలు కూడా లేకపోవడంతో వారంతా నేలపైనే నిద్రిస్తున్నారు. తాజాగా పాము పిల్ల కనిపించడంతో రాత్రిపూట డ్యూటీ చేసే పోలీసులకు భయంతో కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే స్టేషన్‌ పరిసరాలను శుభ్రం చేయించాలని, మౌలిక వసతులు కల్పించాలని సిబ్బంది కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement