పొలం పచ్చగా నవ్వాలి.. పండిన పంట ఇల్లు చేరాలి.. ఇదే ప్రతి రైతన్న కల. కానీ, ఆ కల నిజం కావడానికి కావలసిన ముఖ్యమైన ’యూరియా’ మాత్రం నేడు అన్నదాతకు
అందని ద్రాక్షలా మారింది. తెల్లవారుజామునే లేచి.. ఎరువుల దుకాణాల ముందు క్యూ
కడుతున్నా ఫలితం లేకుండా పోతోంది.
మదనపల్లె (కురబలకోట) : యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. యూరియా కావాలంటే మొదట వ్యవసాయ అధికారుల వద్ద వైబ్‌సైట్‌లో ఆన్‌లైన్ చేసుకోవాలి. తర్వాత ఇస్తారు. గ్రోమోర్, ఏపీ మాస్, ఫర్టిలైజర్ షాప్స్, రైతు సే వా కేంద్రాల ద్వారా పంపిణీ జరుగుతోంది. ఆశించిన స్థాయిలో దొరకడం లేదని రైతులు వాపోతున్నారు.ఎక్కువగా వరి, పశుగ్రాసం సాగుకు యూరియా వినియోగిస్తున్నారు. ఎకరంలోపు ఉంటే ఒక బస్తా, ఎకరానికి పైన ఉంటే రెండు బస్తాలు ఇవ్వాల్సి ఉండగా స్టాక్ లేదన్న కారణంగా ఒక బస్తా మాత్రమే ఇస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. పంటను కాపాడుకునే ఆరాటంలో పనులను పక్కన పెట్టి ఎరువులు దకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి స్టాక్ లేదు..తర్వాత రండి అనే మాటలు విన్పిస్తున్నాయి. ఒక బస్తా చొప్పున మాత్రమే ఇస్తుండడంతో ఇది ఏమూలకు అని ప్రశ్నిస్తున్నారు. దీనికి కూడా గంటల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదని అంటున్నారు. రైతులకు అవసరమైనంత యూరియా అందేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈవిషయమై వ్యవసాయ అధికారులను విచారించగా యూరియా కొరత లేదన్నారు. రైతు సేవా కేంద్రాలకు కూడా అవసరమైన మేరకు సరఫరా చేసినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రారంభించి పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.
సకాలంలో అవసరం
సకాలంలో పంటకు యూరియా వేయడం ముఖ్యం. లేకపోతే పంట ఎదుగుదలపై ప్రభావం చూ పుతుంది. పెట్టుబడుల భా రం, వాతావరణ పరిస్థితులతో రైతులు సతమతం అ వుతున్నారు.ఇప్పుడు యూరియా కొరత స మస్యగా మారడంతో ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. –రఘునాథరెడ్డి,చెన్నామర్రి,కురబలకోటమండలం


