గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు అరెస్టు

Jul 20 2026 1:26 AM | Updated on Jul 20 2026 1:26 AM

గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు అరెస్టు

ఎర్రగుంట్ల : గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 150 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. అదివారం ఇక్కడ ఆయన విలేకరులో మాట్లాడుతూ జిల్లా షెల్కే ఎస్పీ నచికేత్‌ విశ్వనాఽథ్‌ జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఎర్రగుంట్ల లోని వై జంక్షన్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండుగా అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గరిని అరెస్టు చేశామన్నారు. అరెస్టు అయిన వారిలో ప్రొద్దుటూరుకు చెందిన ఎస్‌ జహీర్‌, గుంతకల్‌ పట్టణానికి చెందిన షేక్‌ మహ్మద్‌ తాహీర్‌, షేక్‌ ఆసిఫ్‌లు ఉన్నారన్నారు. వీరు గుంతకల్లులోని షికారి కాలనీ చెందిన కమల, మఽధుమతి, జీవా అనే వారి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. వీరి వద్ద నుంచి 150 గ్రాముల గంజాయి, మూడు మొబైల్‌ ఫోన్లు, రూ.1900 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. గంజాయి సరఫరా చేసే నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రామాంజనేయులుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

చింతకొమ్మదిన్నె మండలంలో..

చింతకొమ్మదిన్నె: మండల పరిధిలోని రోడ్డు క్రిష్ణాపురంలోగల కేఎస్‌ఆర్‌.ఎం ఇంజినీరింగ్‌ కళాశాల బస్టాప్‌ వద్ద నిషేదిత గంజాయి విక్రయిస్తున్న అయిదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి తెలిపిన వివరాల మేరకు కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్‌ కళాశాల బస్టాప్‌ వద్ద గంజాయి అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ శ్రీనివాసుల రెడ్డి సిబ్బందితో వెళ్లి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా రాజస్థాన్‌కు చెందిన, ప్రస్తుతం బద్వేలులో నివాసం ఉంటున్న పరమార్‌ గణపత్‌ సింగ్‌, పార్వతిపురం, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి గంజాయి తీసుకొచ్చి అతని స్నేహితులైన బద్వేలులోని రూపురాంపేటకు చెందిన చిన్నం శ్రీను, బద్వేలు కుమ్మరకొట్టాలుకు చెందిన షేక్‌ మస్తాన్‌ వల్లి, బద్వేలు మండలం బయనపల్లికి చెందిన మామిళ్ళ కార్తిక్‌, చెన్నూరు మండలానికి చెందిన మేసే దినేష్‌ల ద్వారా రోడ్డు క్రిష్ణాపురం, కొప్పర్తి గ్రామం ఇండస్ట్రియల్‌ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఐదుగురిని అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి 1.396 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.నిందితులను కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్‌ విధించడంతో కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement