అండర్‌–19 క్రికెట్‌ పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అండర్‌–19 క్రికెట్‌ పోటీలు ప్రారంభం

Jul 20 2026 1:26 AM | Updated on Jul 20 2026 1:26 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–19 మెన్‌ మల్టీ డే నాలుగో విడత అంతర్‌ జిల్లాల మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో చిత్తూరు–అనంతపురం జట్టు తలపడ్డాయి. తొలి రోజు టాస్‌ గెలిచిన చిత్తూరు జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. 90 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 355 పరుగులు చేసింది. జట్టులోని కృష్ణ ప్రసాద్‌ 111, ఎంహెచ్‌వి రెడ్డి 42 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని కిరణ్‌కుమార్‌ 4, సంజయ్‌కుమార్‌ 2 వికెట్లు తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.

కెఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో.....

అదే విధంగా కెఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కడప–కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. 54.3 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్‌ అయింది. జట్టులోని రోహిత్‌ గౌడ్‌ 55, విఖ్యాత్‌ 52 పరుగులు చేశారు. కడప జట్టులోని శివశంకర్‌ 4, వికెట్లు, నాగకుళ్ళాయప్ప 5 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కడప జట్టు 5 ఓవర్లకు తొలి వికెట్‌ కోల్పోయి 21 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement