మదనపల్లె టౌన్: విషం తాగి వివాహిత ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం రాత్రి మదనపల్లె మండలంలో చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబీకుల కథనం మేరకు.. మండలంలోని కొత్తపల్లి పంచాయతీ, సంధి రెడ్డి పల్లెకు చెందిన భవన కార్మికుడు నాగార్జున భార్య శ్రావణి (30), భర్తతో గొడవపడి పంచాయతీని తాలూకా పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లింది. సీఐ కళా వెంకటరమణ భార్యా భర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి ఇంటికి పంపించాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో మనస్తాపానికి గురైన శ్రావణి ఇంట్లో ఉన్న పురుగుమందు తాగింది. స్థానికులు గమనించి బాఽధిరాలిని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించడంతో, డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


