అతను ఓపిగ్గా సింగిల్, డబుల్స్ తీయగలడు.. జట్టుకు అవసరమైనప్పుడు బౌండరీలతో చెలరేగిపోగలడు.. అంతేనా కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించగలడు.. అతనే ప్రొద్దుటూరు శ్రీరాములపేటకు చెందిన క్రికెటర్ ఎస్. ధ్రువకుమార్ రెడ్డి. ఇటీవల జరిగిన ఏపీఎల్‌లో తన బ్యాటింగ్‌తో శభాష్ అనిపించాడు.
ప్రొద్దుటూరు కల్చరల్ : పట్టణంలోని శ్రీరాములపేటకు చెందిన ఎస్.ధ్రువకుమార్‌రెడ్డి క్రికెట్‌లో ఒపెనింగ్ రైట్‌హ్యాండ్ బ్యాట్స్‌మన్‌గా రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన తండ్రి సిగినేని లక్ష్మిరెడ్డి హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుండగా తల్లి శారదదేవి గృహిణి. చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై ఉన్న ఆసక్తితో 2006లో యూత్‌క్రికెట్ క్లబ్‌లో చేరి సాధన ప్రారంభించాడు. శిక్షణలో అన తి కాలంలోనే కోచ్‌ల నుంచి మెళకువలు నేర్చుకుని ఫొర్‌లు, సిక్సర్‌లు కొడుతూ మంచి రైట్‌హ్యాండ్ బ్యాట్స్‌మన్‌గా పేరు పొందాడు. జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. అండర్–22 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొన్నాడు. సౌత్ ఇండియా అండర్–19 పోటీల్లో పాల్గొని తన బ్యాటింగ్‌తో అందరి మన్ననలు చూరగొన్నాడు. రంజీ, వన్ డే, 20–20, టెస్ట్ మ్యాచ్‌లలో ఆడాడు. ఐదేళ్లుగా ఆంధ్రా ప్రీమియర్‌లీగ్ క్రికెట్ పోటీల్లో ఆడుతున్నాడు. క్రికెట్ పోటీల్లో మంచి నైపుణ్యంతో బ్యాట్స్‌మన్‌గా రాణిస్తుండటంతో ధ్రువకుమార్‌రెడ్డిని రాయల్స్ ఆఫ్ రాయలసీమ మేనేజ్‌మెంట్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా 5 మ్యాచ్‌లు ఆడి రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టును విజయం సాధించడంలో ముందుండి నడిపించాడు. వైజాగ్ లయన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 218 పరుగుల భారీ లక్షసాధనలో ఒంటరి పోరాటం చేస్తూ కేవలం 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్‌లతో 52 పరుగులు బాది కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టులో స్ఫూర్తి నింపాడు. కాగా ప్రస్తుతం ధ్రువ కుమార్‌రెడ్డి సికింద్రాబాద్ రైల్వేలో సీనియర్ క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.


