నందలూరు : సౌమ్యనాథస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతుంది. జులై 21 నుంచి 31వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ ఈఓ ప్రశాంతి, ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్‌లు శుక్రవారం తెలిపారు. 21వ తేదీ ఉదయం తిరుమంజనం, రాత్రికి అంకురార్పణ, 22న ఉదయం ధ్వజారోహణం, రాత్రి యాలివాహనం, 23న ఉదయం పల్లకీసేవ, రాత్రి హంస వాహనం, 24న ఉదయం పల్లకీసేవ, రాత్రి సింహవాహనం, 25న ఉదయం పల్లకీసేవ, రాత్రి హనుమంతవాహనం, 26న ఉదయం శేషవాహనం, రాత్రి గరుడ వాహనం, 27న ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనం, 28న ఉదయం కళ్యాణోత్సవం, రాత్రి గజవాహనం, 29న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 30న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణం, 31న సాయంత్రం పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టామని వారు తెలిపారు.


