● కారు ఢీకొని తీవ్ర గాయాలు
పుంగనూరు : ఓ నిండు ప్రాణాన్ని హెల్మెట్ కాపాడింది. కానీ ప్రమాదంలో ఎడమ కాలు పాదం కోల్పోయాడు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం భగత్‌సింగ్‌కాలనీ మలుపు వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన చక్రనాథ్(30) ద్విచక్రవాహనంలో కోర్టుకు వెళ్లేందుకు మదనపల్లెకు బైపాస్‌లో వెళ్తుండగా.. ఎదురుగా అతివేగంగా వస్తున్న తమిళనాడుకు చెందిన కారు ఢీకొంది. ఈ సమయంలో చక్రనాథ్‌కు హెల్మెట్ ఉండటంతో తలకు ఎలాంటి దెబ్బలు తగలక ప్రాణపాయం నుంచి బయటపడ్డాడు. కానీ కాలు పాదం మాత్రం తెగిపడి పోయింది. ఈ సంఘటనను స్థానికులు గమనించి బాధితున్ని 108లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితున్ని మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


