రొంపిచెర్ల: రాయలసీమ జోనల్ క్రికెట్ పోటీల్లో విన్నర్స్‌గా రొంపిచెర్ల ఫ్రెండ్స్ ఎలెవన్ జట్టు నిలిచింది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో రాయలసీమ జోనల్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 73 టీంలు పాల్గొన్నాయి. శుక్రవారం జరిగిన ఫైనల్లో రొంపిచెర్ల ఫ్రెండ్స్ ఎలెవన్, బబ్లు ఎలెవన్ జట్లు తలపడ్డాయి. బబ్లు ఎలెవన్ జట్టు 12.2 ఓవర్లలో 80 పరుగులకు అలౌటు అయింది. రొంపిచెర్ల జట్టు 8.4 ఓవర్లలో 84 పరుగులు చేసి విజయం సాధించింది. ఎస్.కె.అహ్మద్ 23 బంతుల్లో 3 సిక్స్‌లు, రెండు పోర్లతో 33 రన్స్ చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. దీంతో విజేత జట్టుకు నగదు బహుమతిగా రూ.1.50 లక్షల చెక్‌ను ఆర్గనైజర్ బాలాజీ అందజేశారు. ఈ పోటీల్లో జట్టు సభ్యులు ఉమ మహేశ్వర్, గుర్రప్ప, హర్ష, మణి, ఎస్.కె. అహ్మద్ కిషోర్, బాలు, రాజు, పవన్, భార్గవ్,షమీ, దిలీప్, తిప్పాస్వామి, తదితరులు పాల్గొన్నారు.


