పుంగనూరు : అప్పుల బాధతో ఓ యువకుడు బలవన్మరణం చెందిన సంఘటన పట్టణ సమీపంలోని నక్కబండలో గురువారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. డ్రైవర్‌గా పని చేస్తున్న రెడ్డిప్రసాద్(32) తన కుటుంబ అవసరాల నిమిత్తం అప్పులు చేశాడు. అప్పులు చెల్లించలేక పోవడంతో వడ్డీ వ్యాపారుల వేధింపులు తీవ్రం కావడం వల్ల రాత్రి ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
మదనపల్లె టౌన్ : అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మదనపల్లె మండలం యనమలవారిపల్లె భాగ్యనగర్‌లో చోటు చేసుకుంది. బాధితురాలు తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. భాగ్యనగర్‌లో ఉంటున్న సూర్యకుమారి ఇంటి స్థలంలో వీఆర్‌ఏ వెంకటరమణ దౌర్జన్యంగా షెడ్డు వేయడానికి యత్నించడాన్ని ఆమె అడ్డుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన వీఆర్‌ఏ, అతని కుటుంబ సభ్యులు అర్ధరాత్రి సూర్యకుమారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. గాయపడిన బాధితురాలిని వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
మదనపల్లె టౌన్ : వైద్యం కోసం ఆసుపత్రికి బయలుదేరిన వృద్ధురాలిని బైక్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం బి.కొత్తకోట మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతిప్పసముద్రం మండలం బూసుపల్లికి చెందిన లక్ష్మమ్మ (72)కు ఆరోగ్యం బాగోలేదు. దీంతో కొడుకు మల్లికార్జున, మనవడు సురేష్ ఆమెను బైక్‌పై బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. బైక్ బి.కొత్తకోటకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన మరో బైక్ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న లక్ష్మమ్మ కిందపడి తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మనవడు సురేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులు లక్ష్మమ్మను బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


