● రమ్యశ్రీ ప్రాణాలు కాపాడాలని
తల్లిదండ్రుల ఆవేదన
● ఊపిరితిత్తుల వ్యాధి
● చికిత్సకు రూ.50 లక్షలు ఖర్చు
పుంగనూరు: సాధారణ రైతు కుటుంబంలో వెంకటరమణ, లక్ష్మీ దంపతులకు మూడో కుమారైగా జన్మించిన రమ్యశ్రీ సీఏ పూర్తి చేసుకుని బెంగళూరులో చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర శిక్షణలో ఉండగా ఒక్కసారిగా ఆమెకు ప్రాణాంతమైన ఎల్‌ఏఎం ఊపిరితిత్తుల వ్యాధిసోకింది. ఆసుపత్రులకు తిరిగినా ఫలితం లేదని, ఊపిరితిత్తులు మార్చాలని వైద్యులు తెలపడంతో ఆమె భవిష్యత్తు కుదేలైంది.
రూ.50 లక్షలు ఖర్చు..
రమ్యశ్రీకి ఊపిరితిత్తులు రెండు తీవ్రంగా దెబ్బతినడంతో వాటికి చికిత్స చేయించేందుకు చైన్నె అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఊపిరితిత్తుల మార్పిడికి రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని తెలపడంతో ఆకుటుంబం కన్నీరుమున్నీరౌతోంది. అంత డబ్బు సమకూర్చలేని తల్లిదండ్రులు బిడ్డను పోగొట్టుకోలేక, చికిత్స అందించలేక దాతల సాయంకోసం ఎదురుచూస్తున్నారు. దాతలు ఆదుకుని , తమ బిడ్డ ప్రాణాలను కాపాడాలని ప్రాధేయపడుతున్నారు. దాతలు 7569298992 నంబర్ కు విరాళాలు అందించాలని కోరుతున్నారు.


