నారాయణవనం: మండలంలోని సిద్ధార్థ ఇన్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి కళాశాలలో ఏఐసిటిఇ ఏఐసీటీఇ ఐడియా ల్యాబ్‌ను శుక్రవారం తిరుపతి ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ప్రారంభించారు. ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లారుతూ ఐడియా ల్యాబ్‌లో సిఎస్‌సి మెషన్‌కటింగ్, త్రీడి ప్రింటింగ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, ఐఓటి ల్యాబ్‌లతో విద్యార్థులు తమ నైపుణ్యతను పెంచుకోవాలని అన్నారు. కేంద్రప్రభుత్వం ఇన్నోవేటివ్ టెక్నాలజికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందనిఅన్నారు. యువ ఇంజనీర్లు స్టార్టప్‌లను, ఇంకుబేషన్ కార్యక్రమాలలో పాల్గొని మంచి ఎంటర్‌ప్రెన్యువర్లుగా ఎదగాలని అన్నారు. ఐడియా ల్యాబ్ కోఆర్డినేటర్ రత్నకమల మాట్లాడుతూ సాంకేతిక పరమైన ఐడియాల ట్రాన్స్‌ఫర్మేషన్, ఇన్నోవేషన్, ఇంప్లిమెంటేషన్, స్టార్టప్స్ అంశాలపై పరిజ్ఞానం పెంచుకోవచ్చునని అన్నారు. కళాశాల చైర్మన్ అశోకరాజు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులు అధునాతన సాంకేతిక విజ్ఞనానికి ఐడియాను, టెక్నాలజిని జోడించి అభివృద్ధి పరచడానికి ఐడియా ల్యాబ్ ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. ప్రిన్సిపాళ్లు రమేష్ కుముద్, జనార్థనరాజు, కో కోఆర్డినేటర్ సునీల్ కుమార్ రెడ్డి, హెచ్‌వోడీలు. అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


