గాలివీడు : గాలివీడులోని హైస్కూల్ దగ్గర ఉన్న పూసల కాలనీలో ఓ ఇంట్లో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. బంగారు నగలు, నగదు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. చెప్పలి అలియాస్ కూరగాయల చంద్ర, రాణమ్మలు 40 ఏళ్ల నుంచి చిరు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో కుమారుడు ఉద్యోగంలో స్థిరపడగా, రామచంద్ర సంతల్లో కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారంలో సంపాదించినదే కాకుండా కుమారుడి వివాహానికి అత్త ఇచ్చిన బంగారు అంతా ఇంట్లో బీరువాలో భద్రపరచుకొని సంతలో వ్యాపారానికి వెళ్లారు. ఈ క్రమంలో గురువారం కోనంపేట సంతకు వెళ్లి తిరిగి రావడానికి బస్సు లేక కుమార్తె ఇంటికి వెళ్లారు. ఉదయం లేచి ఇంటికి వచ్చే సరికి తలుపులు, బీరువా పగులగొట్టి 30 తులాల బంగారు ఆభరణాలు, 50 వేల నగదు దోచుకెళ్లారు. సంఘటనను గమనించిన రామచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా లక్కిరెడ్డిపల్లి సీఐ, గాలివీడు ఎస్‌ఐ సిబ్బంది డాగ్ స్క్వాడ్‌తో వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
30 తులాల బంగారు,
రూ.50 వేల అపహరణ


