పెరిగిన టమాట ధర | - | Sakshi
Sakshi News home page

పెరిగిన టమాట ధర

Jul 13 2026 1:28 AM | Updated on Jul 13 2026 1:28 AM

సాక్షి, మదనపల్లె: మదనపల్లె మార్కెట్లో టమాట ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. శనివారం మార్కెట్‌ కు 1,394 టన్నుల టమాట విక్రయానికి రాగా అత్యధిక ధర కిలో రూ.19 పలికింది. ఆదివారం 1,348 టన్నుల టమాట విక్రయానికి రాగా కిలో అత్యధిక ధర రూ.19 పలికి తగ్గకుండా, పెరగకుండా కొనసాగింది.

17 వరకు రైళ్లు రద్దు

కడప కోటిరెడ్డి సర్కిల్‌: ముంబై డివిజన్‌లోని కర్జాత్‌ – లోనావ్లా ( ఎస్‌ఈ) సెక్షన్‌న్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఖండాలా – మంకీహిల్‌ స్టేషన్ల మధ్య జరిగిన ఈ ఘటన కారణంగా ముంబై– చైన్నె (22157), చైన్నె– ముంబై (22158) వెళ్లే రైళ్లను ఈనెల 17వ తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేసినట్లు కడప చీఫ్‌ కమర్షియల్‌ ఇన్స్‌పెక్టర్‌ జనార్ధన్‌ తెలిపారు.

డీసెట్‌లో కవిత స్టేట్‌ఫస్ట్‌

పుంగనూరు: మండలంలోని బి.కొత్తూరు గ్రామానికి చెందిన రెడ్డెప్ప కుమార్తె కవిత.. రాష్ట్రస్థాయి ఏపిడీసెట్‌ ప్రవేశ పరీక్షల్లో ఘనవిజయం సాధించింది. మొత్తం 100 మార్కులకు ఆమె 79 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయిలోనే ప్రథమ ర్యాంకును కై వసం చేసుకుంది. తిరుపతి స్విమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసిన కవిత, ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న ప్రత్యేక మక్కువతో ఈ పరీక్ష రాసి టాపర్‌గా నిలిచింది. గ్రామీణ నేపథ్యం నుండి వచ్చి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన కవితను, ఆమె తల్లిదండ్రులను గ్రామస్తులు ఘనంగా అభినందించారు.

టెన్త్‌ ‘బ్లూప్రింట్‌’,

మోడల్‌ పేపర్లు విడుదల

మదనపల్లె సిటీ: పదో తరగతి (టెన్త్‌) పబ్లిక్‌ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక సమాచారాన్ని విడుదల చేసిందని అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ సుబ్రమణ్యం తెలిపారు. పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి సబ్జెక్టుల వారీ బ్లూప్రింట్‌, మోడల్‌ ప్రశ్నపత్రాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు లీప్‌ యాప్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. ప్రధానోపాధ్యాయులు, ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి బ్లూప్రింట్‌, మోడల్‌ పేపర్లను వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. వాటిని విద్యార్థులకు అందుబాటులో ఉంచి, బోర్డు పరీక్షల ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌లో తగిన గైడెన్స్‌ చేయాలని సూచించారు. రాబోయే పబ్లిక్‌ పరీక్షల సరళి, మార్కుల కేటాయింపు, పరీక్షా విధానాన్ని క్షుణంగా అర్థం చేసుకోవడానికి విద్యార్థులు ఈ బ్లూప్రింట్‌, మోడల్‌ పేపర్లను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు.

థియేటర్లలో ‘సర్‌’

కడప సెవెన్‌రోడ్స్‌ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో ఈ నెల 14 వ తేదీ వరకు ప్రచార దృశ్యాలు, చిత్రాలను తప్పకుండా ప్రదర్శించాలని థియేటర్‌ యాజమాన్యాలు, అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ ద్వారా థియేటర్‌ యాజమాన్యాలకు అవసరమైన సూచనలు జారీ చేసామని కలెక్టర్‌ తెలిపారు. అలాగే ఆయా మండలాల పరిధిలోని రెవెన్యూ అధికారులు కూడా సినిమా థియేటర్‌ యాజమాన్యాలకు సూచనలు అందించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement