మిట్స్‌లో ‘ఫ్యూచర్‌ స్కిల్స్‌’ ల్యాబ్‌లు | - | Sakshi
Sakshi News home page

మిట్స్‌లో ‘ఫ్యూచర్‌ స్కిల్స్‌’ ల్యాబ్‌లు

Jul 13 2026 1:28 AM | Updated on Jul 13 2026 1:28 AM

కురబలకోట: మదనపల్లె సమీపంలోని అంగళ్లు వద్ద గల మిట్స్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ విద్యార్థులను ప్రపంచ స్థాయి టెక్నాలజీ నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా క్యాంపస్‌లో 20 అత్యాధునిక ‘సెంటర్‌ ఫర్‌ ఫ్యూచర్‌ స్కిల్స్‌’ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వర్సిటీ ఛాన్సలర్‌ డాక్టర్‌ నాదేళ్ల విజయభాస్కర్‌ చౌదరి తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మిట్స్‌ యూనివర్సిటీ, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ మధ్య ఈ మేరకు చరిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదిరినట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు వేగంగా మారుతున్న నేపథ్యంలో విద్యార్థులకు కేవలం డిగ్రీలు ఇవ్వడమే కాకుండా గ్లోబల్‌ సంస్థల్లో పోటీపడే సామర్థ్యం కల్పించడమే తమ ఉద్దేశ్యమన్నారు. అందుకే మిట్స్‌లో ఆపిల్‌, మైక్రోసాఫ్ట్‌, ఐబీఎం, ఇంటెల్‌ ఏఐ, మెటా, ఆమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, మహీంద్ర ఈవీ, ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌, ఏబీబీ, ఎన్విడియా, సిస్కో, ఎన్‌ఐఎస్‌ఎం, ఫాలో ఆల్టో తదితర ప్రపంచ ఖ్యాతి గడించిన సంస్థల సాంకేతిక వేదికలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. ఎన్‌ఎస్‌డీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ వరుణ్‌ బత్రా, మిట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ రవికుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement