వాల్మీకిపురం : మహిళా క్రికెట్ పోటీల్లో అనంతపురం జట్టు అదరగొట్టింది. స్థానిక జీవీఎస్‌సీఎస్ క్రీడా మైదానంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న సౌత్‌జోన్ ఉమెన్స్ అండర్ 19 వన్‌డే అంతర్ జిల్లా క్రికెట్ పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల క్రికెట్ టీంలు పాల్గొన్నాయి. టోర్నమెంట్ చాంపియన్స్‌గా అనంతపురం జట్టు, రన్నర్స్‌గా చిత్తూరు జట్టు నిలిచాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రదీప్ ఫౌండేషన్ చైర్మన్ ప్రణీత్, ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయ్ చాంపియన్ జట్లకు ట్రోఫీలను అందించారు. ఈ కార్యక్రమంలో సీడీసీఏ ప్రెసిడెంట్ శ్రీనివాసమూర్తి, వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్‌కుమార్, సెక్రటరీ సతీష్ యాదవ్, ఉమ్మడి చిత్తూరు జిల్లా కోచ్ సునీల్ కుమార్, నాగలక్ష్మి, సాయిప్రభాకర్, ధనలక్ష్మి, మాధవి, శేఖర్, మౌనిక, రెడ్డిరాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
సౌత్‌జోన్ అండర్ 19 టోర్నమెంట్‌లో విజయం


