మదనపల్లె సిటీ : ఏపీ జూనియర్ బాలుర ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలు రెండో రోజు ఆదివారం హోరాహోరీగా జరిగాయి. సెమీఫైనల్స్‌కు కర్నూలు, వైజాగ్, అనంతపురం, ఏలూరు జట్లు చేరుకున్నాయి. స్థానిక వశిష్ట స్కూలులో అన్నమయ్య, చిత్తూరు జట్ల మధ్య జరిగిన పోటీల్లో 1–0 స్కోరుతో అన్నమయ్య జట్టు విజయం సాధించింది. కాకినాడ, తిరుపతి, విజయనగరం, తూర్పుగోదావరి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇందులో మొదటి క్వార్టర్ ఫైనల్స్ కర్నూలు, విజయనగరం జట్ల మధ్య జరగ్గా కర్నూలు జట్టు 2–1 స్కొరుతో విజయనగరంపై విజయం సాధించి సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. రెండో క్వార్టర్ ఫైనల్స్‌లో నెల్లూరు, అనంతపురం జట్లు మధ్య మ్యాచ్ జరగ్గా అనంతపురం జట్టు 2–0 స్కోరుతో విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. రెండో గ్రౌండ్ గ్రీన్‌వ్యాలీలో జరిగిన లీగ్ మ్యాచ్‌లలో గుంటూరు జట్టు 5–0 స్కోరుతో నంద్యాలపై విజయం సాధించింది. కృష్ణ, విశాఖ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2–2తో డ్రాగా ముగిసింది. ఎన్టీఆర్, కోనసీమ జిల్లా జట్లు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎన్టీఆర్ జట్లు 3–1 తో విజయం సాధించింది. మూడో క్వార్టర్ ఫైనల్స్ వైజాగ్, ఎన్టీఆర్ జిల్లా జట్ల మధ్య జరగ్గా 4–0తో వైజాగ్ జట్టు విజయం సాధించి సెమీస్ చేరుకుంది. నాలుగో క్వార్టర్ ఫైనల్స్‌లో పల్నాడు, ఏలూరు జట్లు పోటీపడగా ఏలూరు 3–0 స్కోరుతో పల్నాడుపై విజయం సాధించి సెమీస్ చేరుకుంది. సోమవారం మొదటి సెమీఫైనల్ కర్నూలు, వైజాగ్, రెండో సెమీ ఫైనల్స్ అనంతపురం, ఏలూరు జట్ల మద్య జరుగుతుందని పుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మురళీధర్ తెలిపారు. కార్యక్రమంలో కోచ్‌లు రెడ్డప్ప, పవన్, రెఫరీహెడ్ శ్రీనివాస్, అసోసియేషన్ ఉపాధ్యక్షులు చంద్రకళ, కమలేష్, కోశాధికారి నరేష్‌బాబు, జాయింట్ సెక్రటరీ మహేంద్రనాయక్, మహేంద్ర, కిరణ్‌కుమార్, బాలాజీ, అంజనప్ప, క్రీడాకారులు పాల్గొన్నారు.


