– ఇద్దరికి తీవ్ర గాయాలు
ములకలచెరువు : ట్రాక్టర్, మినీ ఐచర్ వాహనం ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన శనివారం తెల్లవారుజామున మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... చిత్తూరు నుంచి గుంతకల్లు సమీపంలోని కసాపురం శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి కొబ్బరికాయలతో వెళ్తున్న మినీ ఐచర్ వాహనం, ములకలచెరువు నుంచి మదనపల్లి వైపు ఖాళీ టమాట క్రేట్లతో వెళ్తున్న ట్రాక్టర్ బురకాయలకోట వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐచర్ డ్రైవర్ బాబు(45), అందులో ప్రయాణిస్తున్న ప్రభాకర్‌రెడ్డి(60)లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, అటువైపు వెళ్లే ప్రయాణికులు.. పోలీసులు, 108 వాహనానికి సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న పోలీసులు 108 సాయంతో బాధితులను మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలను పక్కకు జరిపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


