నవీన విద్యకు ..‘నవోదయం’ | - | Sakshi
Sakshi News home page

నవీన విద్యకు ..‘నవోదయం’

Jul 12 2026 1:47 AM | Updated on Jul 12 2026 1:47 AM

నవీన విద్యకు ..‘నవోదయం’

దరఖాస్తు చేసుకోవాలి

మదనపల్లె సిటీ : ప్రతిభ ఉండి కూడా ఆర్థిక స్థోమత లేక కార్పొరేట్‌ చదువులకు దూరమవుతున్న గ్రామీణ విద్యార్థులకు ఇదో సువర్ణావకాశం. కేంద్ర ప్రభుత్వ నిధులచే నడిచే ప్రతిష్టాత్మక పీఎంశ్రీ జవహర్‌ నవోదయ విద్యాలయం మదనపల్లె సమీపంలోని వలసపల్లెలో ఉంది. 20207–28 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

ఉజ్వల భవిత

నవోదయలో సీటు సాధించిన విద్యార్థులకు 6వ తరగతి నుంచి ప్లస్‌ టూ (12వ తరగతి) వరకు కేంద్ర ప్రభుత్వ సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ సిలబస్‌లో పూర్తి ఉచిత విద్య అందుతుంది. కో– ఎడ్యుకేషన్‌ విధానం ఉన్న ఈ సంస్థలో బాల,బాలికలకు విడివిడిగా అత్యాధునిక వసతి సౌకర్యాలను కల్పిస్తారు. ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో సీట్లు సాధించేలా ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం విశేషం.

అర్హతలు ఇవే :

విద్యార్థులు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. అలాగే 3,4, తరగతులు కూడా ఇదే జిల్లాలో చదివి ఉండాలి. అలాగే విద్యార్థులు 1–5–2015 నుంచి 31–7–2017 మధ్య కాలంలో జన్మించిన వారై ఉండాలి.

పల్లె పిల్లలకే పెద్ద పీట:

విద్యాలయంలో 80 సీట్లలో 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంత పాఠశాలల విద్యార్థులకే కేటాయిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. మొత్తం సీట్లలో మూడో వంతు సీట్లను బాలికలకే ప్రత్యేకంగా కేటాయించారు.

మదనపల్లె నవోదయలో 6వ తరగతికి ప్రవేశాలు

ఉచితంగా కార్పొరేట్‌ స్థాయి విద్య

ఈ నెల 31వ తేదీ చివరి గడువు

నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. నవంబర్‌ 28న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు httpr:/// nv-av-oda ya.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తులను ఆప్‌లోడ్‌ చేసుకోవాలి.

– ఎం.గీత, ప్రిన్సిపాల్‌,

నవోదయ విద్యాలయం, మదనపల్లె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement