జమ్మలమడుగు రూరల్: జమ్మలమడుగు – ప్రొద్దుటూరు రహదారిలోని సలివెందుల గ్రామ సమీపంలో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద శనివారం జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొంది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న దూదేకుల శీలన్న వీఆర్‌ఏ (65) అనే వ్యక్తి మృతి చెందగా అల్లుడు దూదేకుల రెడ్డప్ప తీవ్రంగా గాయపడ్డాడు. దూదేకుల శీలన్న నంద్యాల డివిజన్‌లోని అవుకు మండలం చెన్నంపల్లె గ్రామంలో వీఆర్‌ఏగా విధులు నిర్వహిస్తున్నాడు. స్థానికులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన రెడ్డప్ప పట్టణంలో కూగాయాలు వ్యాపారం చేసుకోని జీవించేవాడు. శనివారం ప్రొద్దుటూరుకు వెళ్లి కూరగాయాలు తీసుకుని వచ్చేందుకు ఆటోలో వెళుతండగా సొంత పనుల నిమిత్తం దూదేకుల శీలన్న రెడ్డప్పతో కలసి బయలుదేరాడు. సలివెందుల గ్రామానికి వెళ్లగానే వెనుక వైపు నుంచి వస్తున్న కారు ఢీకొంది. ఈ సంఘటనలో దూదేకుల శీలన్న మృతి చెందగా ఆటో నడుపుతున్న రెడ్డప్పకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రెడ్డప్పను ప్రొద్దుటూరుకు తరలించారు. డాక్టర్లు ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలు తీసుకెళ్లాలని సూచించడంతో కుటుంబ సభ్యులు కర్నూల్‌కు తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వారికి బెలూన్‌లు ఓపెన్ కావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
వ్యక్తి మృతి


