మదనపల్లె టౌన్: మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం అధికారులు ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. కడప జిల్లాలో కోవిడ్‌తో ఇద్దరు మతి చెందిన నేపథ్యంలో రాయచోటి, మదనపల్లె ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయలేదని శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ లక్ష్మీ నరసయ్య తెలిపారు. కోవిడ్ బారిన పడిన బాధితులు అత్యవసర చికిత్సలు పొందేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. సిబ్బందిని అప్రమత్తం చేసి మందులు, ఆక్సిజన్, ఇతర సౌకర్యాలు సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.


