వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు

Jul 11 2026 3:34 AM | Updated on Jul 11 2026 3:34 AM

వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు చిన్నారిపై చిన్నాన్న అఘాయిత్యం

బద్వేలు అర్బన్‌/అట్లూరు : బద్వేలు పట్టణంలో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. బద్వేలులోని సిద్దవటం రోడ్డులో అబ్బుసాహెబ్‌పేట క్రాస్‌ రోడ్డు వద్ద రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. బయనపల్లె నుంచి బద్వేలుకు ద్విచక్ర వాహనంపై వెంకటసాయి, సతీష్‌ .. కడప నుంచి బద్వేలుకు ద్విచక్ర వాహనంలో అశోక్‌కుమార్‌, రాజేష్‌ వస్తున్నారు. ఎదురెదురుగా వస్తున్న ఈ రెండు బైక్‌లు రోడ్డుపై గుంతను తప్పించే క్రమంలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో వారి నలుగురికి తీవ్ర గాయాలు కాగా అశోక్‌కుమార్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తరలించారు.

కారు ఢీకొని..

బద్వేలులోని మైదుకూరు రోడ్డులో స్టేట్‌ బ్యాంక్‌ మెయిన్‌ బ్రాంచ్‌ వద్ద శుక్రవారం రాత్రి కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సురేంద్రనగర్‌కు చెందిన బి.షరీఫ్‌, నందిపల్లెకు చెందిన జోషి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ఎదురుగా కారు వస్తుండటంతో తప్పించే క్రమంలో కారును ఢీకొన్నారు. దీంతో ఇరువురు కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో షరీఫ్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు.

పోక్సో కేసు నమోదు

చక్రాయపేట : మండలంలోని ఎర్రబోమ్మనపల్లె గ్రామం గడ్డంవారిపల్లె దళితవాడకు చెందిన చెప్పలి సుబ్రమణ్యం(30) అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు. గురువారం సాయంత్రం వేప విత్తనాలు ఏరుకొస్తామని రా అని తన అన్న కుమార్తె(8)ను అతను తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం వైద్యశాలకు తీసుకెళ్లారు. సంఘటన స్థలానికి పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌, ఆర్కే వ్యాలీ సీఐ శంకర్‌రెడ్డి, ఎస్‌ఐలు చంద్రశేఖర్‌, శ్రీప్రియ, పోలీసు సిబ్బంది, క్లూస్‌ టీం సభ్యులు వెళ్లి పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement