గుర్రంకొండ: సమాజంలో మహిళలు, చిన్నారుల రక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లాకలెక్టర్ నిశాంత్‌కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్లో సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గతంలో పోలీస్‌స్టేషన్లో నమోదైన కేసులు వివరాల గురించి ఆరా తీశారు. ఈసందర్భంగా పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధిత మహిళలతో నేరుగా మాట్లాడారు. పోలీస్‌స్టేషన్లో పోలీసుల పనితీరు, వారి సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు చిన్నారుల రక్షణకు పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోక్సో, బాల్యవివాహాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సదరు కేసుల్లో బాధితులకు న్యాయం అందించాలని ఆదేశించారు. మహిళా పోలీసులు అన్నివేళలా గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. గ్రామాల్లో గంజాయి బ్యాచ్‌లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. బస్టాండుల్లో, విద్యాసంస్థల పరిసరాల్లో గంజాయిబ్యాచ్, అల్లరి మూకల కదలికపై దృష్టి సారించి కఠిన మైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, సీఐ రాఘవరెడ్డి, ఎస్‌ఐ రవీంద్రలు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్,
ఎస్పీ ధీరజ్ కునుబిల్లి


