కరోనా ఒకరి నుంచి మరొకరికి ప్రబలకుండా పాటించాల్సిన జాగ్రత్తలు.. | - | Sakshi
Sakshi News home page

కరోనా ఒకరి నుంచి మరొకరికి ప్రబలకుండా పాటించాల్సిన జాగ్రత్తలు..

Jul 10 2026 5:16 AM | Updated on Jul 10 2026 5:16 AM

1. వ్యక్తిగత పరిశుభ్రత

చేతులను శుభ్రం చేసుకోవడం: రోజూ పలుమార్లు కనీసం 20 సెకన్ల పాటు చేతులను సబ్బు, నీటితో బాగా కడుక్కోవాలి. లేదా 60% పైగా ఆల్కహాల్‌ ఉన్న హ్యాండ్‌ శానిటైజర్‌ను ఉపయోగించాలి.

ముఖాన్ని తాకవద్దు: చేతులను శుభ్రం చేసుకోకుండా కళ్లు, ముక్కు, నోటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు.

దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు: దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోటికి, ముక్కుకు అడ్డంగా టిష్యూ పేపర్‌ను గానీ లేదా మోచేతిని గానీ అడ్డు పెట్టుకోవాలి. వాడిన టిష్యూలను వెంటనే చెత్తబుట్టలో పడేయాలి.

2. సామాజిక నిబంధనలు

మాస్క్‌ ధరించడం: కిక్కిరిసిన ప్రదేశాలు, బహిరంగ స్థలాలు, ఆసుపత్రులకు వెళ్లేటప్పుడు ముక్కు, నోరు పూర్తిగా కవర్‌ అయ్యేలా కచ్చితంగా మాస్క్‌ ధరించాలి.

భౌతిక దూరం: ఇతర వ్యక్తుల నుంచి కనీసం 6 అడుగుల (రెండు గజాల) భౌతిక దూరాన్ని పాటించడం అలవాటు చేసుకోవాలి.

4. లక్షణాలు ఉన్నప్పుడు

చేయాల్సినవి

స్వీయ నిర్బంధం: జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఆయాసం లేదా వాసన/రుచి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఇతరుల నుంచి విడిగా (ఐసోలేషన్‌లో) ఉండాలి.

వైద్య సంప్రదింపులు: కోవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే సొంత వైద్యం చేసుకోకుండా, తక్షణమే అర్హత కలిగిన వైద్యాధికారులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement