సాక్షి, మదనపల్లె: జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాలకు కొత్త వాహనాలు రానున్నట్లు జిల్లా విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక అధికారి వి.ఆదినారాయణరెడ్డి తెలిపారు. లక్కిరెడ్డిపల్లెకు ఇప్పటికే కొత్త వాహనం రాగా, త్వరలోనే వాయల్పాడు, పుంగనూరులకు అందుబాటులోకి వస్తాయన్నారు. ములకలచెరువులో కొత్త భవన నిర్మాణం పూర్తి కావొస్తోందని, జిల్లాలో ఉన్న 40 మంది సిబ్బంది కొరతను ప్రభుత్వం భర్తీ చేయనుందని చెప్పారు. కాగా, బెంగళూరులో ఇండియన్ రైల్వే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి ఉన్నత శిక్షణా కార్యక్రమంలో జిల్లా నుంచి తాను పాల్గొన్నట్లు ఆయన వివరించారు. ఇస్రో, వాతావర ణ శాఖల ఉన్నతాధికారులు హాజరైన ఈ సదస్సులో రైలు ప్రమాదాలు, విపత్తుల సమయంలో సత్వర సహాయక చర్యలు చేపట్టడంపై అవగాహన కల్పించారని తెలిపారు.


