● కడప జట్టుపై విజయం
● కొనసాగుతున్న ఉమెన్స్ అండర్ 19 వన్‌డే పోటీలు
వాల్మీకిపురం : స్థానిక జీవీఎస్‌సీఎస్ క్రీడా మైదానంలో సౌత్‌జోన్ ఉమెన్స్ అండర్ 19 వన్‌డే అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో భాగంగా గురువారం ఉదయం గ్రౌండ్ 2 క్రీడామైదానంలో కడప, కర్నూల్ జట్లు తలపడ్డాయి. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన కర్నూలు జట్టు 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. అనంతరం 351 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కడప జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసి అపజయం పాలైంది. కర్నూలు జట్టుకు చెందిన సహస్ర రెడ్డి 101 బంతుల్లో 133 పరుగులు, రక్షిత 118 బంతుల్లో 132 పరుగులతో చెలరేగిపోవడంతో 350 స్కోర్‌ను కర్నూలు జట్టు సాధించడంతో.. కడప జట్టుపై 44 పరుగుల తేడాతో విజయం సులభతరమైంది.
చిత్తూరు జట్టుపై అనంతపురం జయభేరి
గ్రౌండ్ 1లో అనంతపురం, చిత్తూరు జట్లు తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన అనంతపురం జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన చిత్తూరు జట్టు 42.2 ఓవర్లలో 162 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం 163 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన అనంతపురం జట్టు 43.4 ఓవర్లల్లో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని కై వసం చేసుకుంది. ఈ పోటీలను శ్రీనివాసమూర్తి, శ్రీధర్‌కుమార్, సునీల్ కుమార్, సతీష్ యాదవ్, నాగలక్ష్మి, సాయిప్రభాకర్, అనిత, ధనలక్ష్మి, మాధురి, శేఖర్, మౌనిక, రెడ్డిరాఘవేంద్ర తదితరులు పర్యవేక్షించారు.


