మహానేత స్మృతుల్లో | - | Sakshi
Sakshi News home page

మహానేత స్మృతుల్లో

Jul 9 2026 6:17 AM | Updated on Jul 9 2026 6:17 AM

వైఎస్సార్‌ జయంతి వేడుకల్లో

వైఎస్‌ కుటుంబ సభ్యులు

ఇడుపులపాయలో

వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి

సాక్షి కడప/వేంపల్లె : మహానేత, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్మృతుల్లో అభిమానులు మునిగిపోయారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు, నేతలు వైఎస్సార్‌ 77వ జయంతి సందర్భంగా స్మరించుకున్నారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వైఎస్సార్‌పై ఉన్న ప్రేమతో సమాధి ఘాట్‌ను సందర్శించేందుకు వచ్చిన జనంతో ఆ ప్రాంతం నిండిపోయింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి సమాధి ఘాట్‌ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించడంతోపాటు మోకాళ్లపై కూర్చొని కాసేపు మౌనంగా నాన్నను స్మరించుకున్నారు. వైఎస్‌ జగన్‌తోపాటు తల్లి వైఎస్‌ విజయమ్మ, సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి, చిన్నాన్న వైఎస్‌ సుధీకర్‌రెడ్డి, అత్తమ్మ డాక్టర్‌ ఈసీ సుగుణమ్మ, సోదరుడు, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డితో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఘాట్‌ వద్ద వైఎస్సార్‌ అమర్‌రహే అంటూ నినాదాలు చేస్తూ ప్రతి ఒక్కరూ వైఎస్సార్‌ను గుర్తు చేసుకున్నారు. వైఎస్‌ కుటుంబ సభ్యులతోపాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు అంజలి ఘటించారు.

● రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండోరోజు పర్యటనలో భాగంగా ప్రజలతో కాసేపు గడిపారు. పులివెందులలోని భాకరాపురం వద్ద గల ఇంటి వద్ద వేచి ఉన్న జనాలతోనూ మాట్లాడారు. అనంతరం దారిలో కాన్వాయ్‌ నుంచే ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.

వైఎస్‌ జగన్‌కు వీడ్కోలు పలికిన నేతలు

వైఎస్సార్‌ జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులకు వచ్చిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం బెంగళూరుకు పయనమయ్యారు. మాజీ సీఎంకు పార్టీ నాయకులు, శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఇడుపులపాయలోని హెలిప్యాడ్‌ వద్ద వీడ్కోలు పలికారు.

వైఎస్‌ జగన్‌ను కలిసిన నేతలు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఘాట్‌ వద్ద నివాళులర్పించిన అనంతరం పలువురు రాష్ట్ర,జిల్లా నేతలు కలిశారు. ప్రధానంగా రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల పార్టీ అధ్యక్షులు ఆకేపాటి అమరనాథరెడ్డి, పోచమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, బద్వేలు, ఆలూరు ఎమ్మెల్యేలు డాక్టర్‌ సుధ, విరూపాక్షి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాష, మాజీ మంత్రులు ఉషశ్రీ చరణ్‌, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, రమేష్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, రెడ్డెప్పగారి రమేష్‌కుమార్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, అత్తార్‌ చాంద్‌బాష, గుంటూరు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, కడప, కర్నూలు మాజీ మేయర్లు కె.సురేష్‌బాబు, బీవై రామయ్య, కమలాపురం, కదిరి ఇన్‌చార్జిలు నరేన్‌ రామాంజులరెడ్డి, మగ్బూల్‌బాష, పార్టీ రాష్ట్ర నాయకులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, రాజోలి వీరారెడ్డి, సాయినాథ్‌శర్మ, గోసుల శివభరత్‌రెడ్డి, భరత్‌రెడ్డి, డాక్టర్‌ సొహయిల్‌ అహ్మద్‌ తదితరులు పార్టీ అధినేతను కలిశారు.

వృద్ధురాలికి ఆప్యాయ పలకరింపు

చిన్నారికి

ఆశీర్వాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement