చౌడేపల్లె : గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన చౌడేపల్లె –సోమల మార్గంలోని సింగిరిగుంట సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలాఉన్నాయి. మండలంలోని పెద్దకొండామర్రి పంచాయతీ కోటూరుకు చెందిన మల్కీసాబ్ కుమారుడు జబీవుల్లా(28) మేసీ్త్ర కూలీపనులు చేసేవాడు. ఈక్రమంలో ఇంటినుంచి స్కూటర్‌పై కూలీ పనికి వెళ్ళిన యువకుడు సింగిరిగుంట సమీపంలో రోడ్డు పక్కన రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడిఉండగా ఆమార్గంలో వెళ్తున్న వాహనదారులు గుర్తించి పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. కాగా జబీవుల్లా తలకు తీవ్ర గాయం కావడంతోపాటు కుడి చెయ్యి విరిగిపోయిందని.. పరిస్థితి ఆందోళన కరంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యసేవల కోసం 108 వాహనంలో మదనపల్లెకు తరలించారు.


