ఒరిస్సా వాసి అనుమానాస్పదస్థితిలో మృతి | - | Sakshi
Sakshi News home page

ఒరిస్సా వాసి అనుమానాస్పదస్థితిలో మృతి

Jul 9 2026 6:17 AM | Updated on Jul 9 2026 6:17 AM

కలకడ : హోటల్‌లో పనిచేయడానికి కుమారుడితోపాటు ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా కలకడ కు వచ్చి అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి చెందినట్లు కలకడ ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలాఉన్నాయి. హోటల్‌ లో సర్వర్‌ గా పనిచేయడానికి వచ్చిన ఒరిస్సా లోని కటల్‌ గ్రామానికి చెందిన కమల్‌ఖాన్‌ కుమారుడు ఇస్తియాక్‌ ఆలం (34) మంగళవారం రాత్రి కలకడ ఇందిరమ్మ కాలని సమీపంలోని హెచ్‌పిఆర్‌ డాబా లో అన్నం వడ్డించడానికి తనకుమారుడు వలితో కలిసి హాజరయ్యారు. హోటల్‌లో కూలికి పనిచేయడానికి కేవలం మూడురోజుల క్రితం వచ్చిన వ్యక్తి మంగళవారం రాత్రి నిద్రించినట్లు హోటల్‌ సిబ్బంది తెలిపారు. బుధవారం ఉదయం మృతిచెందినట్లు గుర్తించిన హోటల్‌ సిబ్బంది కలకడ పోలీసులకు సమాచారం అందించారు. కలకడ ఎస్‌ఐ రామాంజనేయులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శవ పంచనామా నిమిత్తం ఇస్తియాక్‌ ఆలం మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement