ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. | - | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

Jul 9 2026 6:17 AM | Updated on Jul 9 2026 6:17 AM

కొనసాగుతున్న ఏసీఏ అండర్‌–19

మల్టీ మ్యాచ్‌లు

90 పరుగుల తేడాతో కడప జట్టు విజయం

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ అండర్‌–19 మల్టీ మ్యాచ్‌లు రెండవ రోజు కొనసాగాయి. కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో కడప జట్టు 90 పరుగుల తేడాతో రెండవ రోజే విజయం సాధించింది. బుధవారం రెండవ రోజు 361 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కడప జట్టు 64.2 ఓవర్లకు 392 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని ధీరజ్‌కుమార్‌రెడ్డి 30 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని టివి సాయి ప్రతాప్‌ 4 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అనంతపురం జట్టు 58.4 ఓవర్లకు 233 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని ఆది నారాయణ 63, నంద కిషోర్‌ 49 పరుగులు చేశారు. కడప జట్టులోని నాగ కుళ్ళాయప్ప 4 వికెట్లు తీశాడు. ధీరజ్‌కుమార్‌రెడ్డి 2, హార్దిక్‌ రెడ్డి 2 వికెట్లు తీశారు. దీంతో కడప జట్టు 90 పరుగుల తేడాతో విజయం సాధించింది.

వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో..

అదే విధంగా వైఎస్‌ఆర్‌ఆర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రెండవ రోజు 14 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కర్నూలు జట్టు 91 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 360 పరుగులు చేసింది. ఆ జట్టులోని సాయి గణేష్‌ 134 పరుగులు, రితిక్‌ 68 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని తేజసాయి 6 వికెట్లు తీశాడు. ఏకాసర్‌ 2 వికెట్లు తీశాడు. దీంతో కర్నూలు జట్టు 33 పరుగుల అధిక్యంతో ఉంది. దీంతో రెండవరోజు ఆట ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement