పద్యమై ప్రశ్నించి..తత్వమై కదిలించి.. | - | Sakshi
Sakshi News home page

పద్యమై ప్రశ్నించి..తత్వమై కదిలించి..

Jul 9 2026 6:17 AM | Updated on Jul 9 2026 6:17 AM

మదనపల్లి (కురబలకోట) : శతాబ్దాలు గడిచినా వేమన పద్యం ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది. వర్షంలో తడవని వారు వేమన పద్యం రాని తెలుగు వారు అరుదు. అంతలా ఆయన పద్యాలు జన బాహుల్యంలో ప్రాబల్యం పొందాయి. మదనపల్లి పట్టణం సీఎస్‌ఐ కమ్యూనిటీ హాల్‌లో భారతీయ అంబేద్కర్‌ సేన (బాస్‌) వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్‌ సౌజన్యంతో హైదరాబాదుకు చెందిన అభ్యుదయ ఆర్ట్స్‌ అకాడమీ సమర్పణలో ప్రజా కవి యోగి వేమన నాటక ప్రదర్శన జనాదరణ పొందింది. అకాడమీ ఇన్‌చార్జి జగ్గరాజు పర్యవేక్షణలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఉప్పుకప్పురంబు ఒక్క పోలిక నుండు..అల్పుడెప్పుడు పల్కు ఆడంబరం గాను..తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు వాడు పుట్టనేమి గిట్టనేమి.. చంపదగిన యట్టి శత్రువు తన చేత చిక్కినేని కీడు సేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు అనే పద్యాలు జన బాహుల్యంలో నేటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ కార్యక్రమంలో రోజా హోటల్స్‌ అధినేత కంభం పాటి నాగభూషణ్‌ రెడ్డి, పోతబోలు రెడ్డెప్ప, వెంకటేష్‌, విజయకుమార్‌, శ్రీ చందు, ముత్యాల మోహన్‌, శశిధర్‌, దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రేక్షకులను అలరించిన వినుర వేమ నాటకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement