జిల్లా కేంద్రంగా రాయచోటిని ఉంచాలని కౌన్సిలర్లు రాజీనామా | - | Sakshi
Sakshi News home page

జిల్లా కేంద్రంగా రాయచోటిని ఉంచాలని కౌన్సిలర్లు రాజీనామా

Dec 31 2025 7:16 AM | Updated on Dec 31 2025 7:16 AM

జిల్ల

జిల్లా కేంద్రంగా రాయచోటిని ఉంచాలని కౌన్సిలర్లు రాజీనామా

రాయచోటి అర్బన్‌ : అన్నమయ్య జిల్లా కేంద్రంగా మూడున్నరేళ్లుగా రాయచోటి కొనసాగింది. ఇప్పుడు కేవలం రాజకీయ కక్షతో రాయచోటి ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా.. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాయచోటి మున్సిపాలిటీలో ఏడుగురు కౌన్సిలర్లు రాజీనామా చేశారు. అందులో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పోలంరెడ్డి దశరథరామిరెడ్డి కూడా ఉన్నారు. జిల్లా ఏర్పడిన తరువాత అవసరమైన అన్ని జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని, పరిపాలన సజావుగా జరుగుతున్న తరుణంలో కేవలం రాజకీయ స్వలాభం కోసం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయచోటి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వారు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయచోటికి వచ్చిన చంద్రబాబు మాయమాటలు చెప్పి, ప్రజలను మోసం చేసినట్లు వారు అభిప్రాయపడ్డారు. భౌగోళికంగా అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉన్న రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేసిన వైఎస్సార్‌సీపీని, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, జిల్లా సాధనకు కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డిని ఈ సందర్భంగా వారు కొనియాడారు. కౌన్సిలర్‌ పదవికి రాజీనామా చేసిన వారిలో వైస్‌ చైర్మన్‌ దశరథరామిరెడ్డి, 15వ వార్డు కౌన్సిలర్‌ పోలంరెడ్డి విజయ, 26వ వార్డు కౌన్సిలర్‌ కసిరెడ్డి వెంకటనరసింహారెడ్డి, 2వ వార్డు కౌన్సిలర్‌ సుగవాసి పద్మావతి, 32వ వార్డు కౌన్సిలర్‌ గువ్వల లక్ష్మీదేవి, 14వ వార్డు కౌన్సిలర్‌ మడితాటి సరోజమ్మ, 20వ వార్డు కౌన్సిలర్‌ పాపిరెడ్డి మదనమోహన్‌రెడ్డి ఉన్నారు. అలాగే మరికొంత మంది మున్సిపల్‌ పాలకవర్గ కౌన్సిలర్లు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి తరలిస్తే పదవులకు రాజీనామాలు చేసి, పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు వారు చెబుతున్నారు. ఇప్పటికై నా ముఖ్యమంత్రి చంద్రబాబు రాయచోటి ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

అదే బాటలో మరికొంత మంది మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు

గువ్వల లక్ష్మీదేవి సుగవాసి పద్మావతి

జిల్లా కేంద్రంగా రాయచోటిని ఉంచాలని కౌన్సిలర్లు రాజీనామా1
1/6

జిల్లా కేంద్రంగా రాయచోటిని ఉంచాలని కౌన్సిలర్లు రాజీనామా

జిల్లా కేంద్రంగా రాయచోటిని ఉంచాలని కౌన్సిలర్లు రాజీనామా2
2/6

జిల్లా కేంద్రంగా రాయచోటిని ఉంచాలని కౌన్సిలర్లు రాజీనామా

జిల్లా కేంద్రంగా రాయచోటిని ఉంచాలని కౌన్సిలర్లు రాజీనామా3
3/6

జిల్లా కేంద్రంగా రాయచోటిని ఉంచాలని కౌన్సిలర్లు రాజీనామా

జిల్లా కేంద్రంగా రాయచోటిని ఉంచాలని కౌన్సిలర్లు రాజీనామా4
4/6

జిల్లా కేంద్రంగా రాయచోటిని ఉంచాలని కౌన్సిలర్లు రాజీనామా

జిల్లా కేంద్రంగా రాయచోటిని ఉంచాలని కౌన్సిలర్లు రాజీనామా5
5/6

జిల్లా కేంద్రంగా రాయచోటిని ఉంచాలని కౌన్సిలర్లు రాజీనామా

జిల్లా కేంద్రంగా రాయచోటిని ఉంచాలని కౌన్సిలర్లు రాజీనామా6
6/6

జిల్లా కేంద్రంగా రాయచోటిని ఉంచాలని కౌన్సిలర్లు రాజీనామా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement